Hero Abbas: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో అబ్బాస్..ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు..ఏం చేస్తున్నాడంటే

Hero Abbas
Hero Abbas

Hero Abbas: ఒక్కప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో అబ్బాస్ కు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.దానికి కారణం ప్రేమదేశం చిత్రం అని చెప్పచ్చు.అప్పట్లో రిలీజ్ అయినా ప్రేమదేశం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా అబ్బాస్ కు యెనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది.ఈ సినిమాలో ప్రియురాలి ప్రేమ కోసం పరితపించిపోయే ప్రియుడి పాత్రలో అబ్బాస్ నటన అద్భుతమని చెప్పచ్చు.ముఖ్యంగా అమ్మాయిలలో అబ్బాస్ కు ఫ్యాన్స్ బాగా పెరిగిపోయారు.అప్పట్లో అబ్బాస్ హెయిర్ స్టైల్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది.యెంత త్వరగా అబ్బాస్ (Abbas) హీరోగా గుర్తింపు తెచుకున్నాడో అంతే త్వరగా అబ్బాస్ కనుమరుగైపోయాడు.

దానికి కారణం డబ్బుల కోసం ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చేసి వరుసగా ప్లాప్ లు అందుకోవడంతో అబ్బాస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది.ఆ తర్వాత విలన్గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అడపాదడపా సినిమాలు చేసాడు అబ్బాస్.50 కు పైగా సినిమాలలో నటించిన అబ్బాస్ ఆ తర్వాత కనుమరుగైపోయాడు.ఒక్కప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా చేసిన వాళ్ళు చాల మంది ప్రస్తుతం విలన్లుగా,క్యారక్టర్ ఆర్టిస్టులుగా దర్శనం ఇస్తున్నారు.అయితే హీరో అబ్బాస్ మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ జీవితం సాగిస్తున్నాడు.

ప్రస్తుతం ప్రేమదేశం హీరో అబ్బాస్ ఏం చేస్తున్నాడు,ఎక్కడ ఉన్నాడు అనేది చాల మందికి తెలియదు.అయితే సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా అవకాశాలను కోల్పోయిన తర్వాత అబ్బాస్ న్యూజిలాండ్ వెళ్లి మొదట్లో అక్కడే పెట్రోల్ బంక్ లో పని చేసేవాడట.ప్రస్తుతం భావన నిర్మాణ పనులలో అనుభవం సంపాదించి అక్కడే స్థిరపడిపోయినట్లు సమాచారం.అయితే తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని అబ్బాస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి.