Kamalini Mukherjee: షాక్ అయ్యేలా మారిపోయిన ఆనంద్ సినిమా హీరోయిన్ కమలిని ముఖేర్జీ…చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..!

Kamalini Mukherjee: సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బాగా రాణించి ఒక వెలుగు వెలిగిన తారలు సడన్ గా మాయమైపోతూ ఉంటారు.ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు…ఎక్కడ ఉన్నారు అనేది కూడా చాల మందికి తెలియదు.అలా సినిమాలలో బాగా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత మాయపొయినా హీరోయిన్లలో కమలిని ముఖర్జీ కూడా ఒకరు అని చెప్పచ్చు.ఈమె శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమాతో 2004 హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

సూపర్ హిట్ అయినా ఈ సినిమా కమలిని ముఖేర్జీ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.తెలుగులో ఆనంద్ సినిమా తర్వాత గమ్యం,మీనాక్షి,గోదావరి,క్లాస్ మేట్స్,హ్యాపీ డేస్,జల్సా,గోపి గోపిక గోదావరి,రామాచారి వంటి పలు సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఇక చివరగా కమలిని ముఖేర్జీ రామ్ చరణ్ హీరోగా చేసిన గోవిందుడు అందరివాడేలే అనే సినిమాలో నటించడం జరిగింది.

ఆ తర్వాత కమలిని ముఖేర్జీ సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలో బాగా రాణిస్తూ అమెరికాలో సెట్ల్ అయినట్లు సమాచారం.ఇటీవలే ఈమె డల్లాస్ లో జరిగిన ఒక వేడుకలో పాల్గొని సందడి చేయడంతో ఆ ఫోటోలు కాస్త నెట్టింట్లో వైరల్గా మారాయి.లేటెస్ట్ ఫోటోలలో కొంచెం బొద్దుగా మారిపోయిన కమలిని ముఖేర్జీని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment