ఆయన సినిమాలలో హీరోల ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అందుకే ఆయన సినిమాలలో నటీనటులుగా చేయడానికి చాల మంది క్యూ కడతారు.ఆయన సినిమాలలో చిన్న పాత్ర అయినా సరే చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు చాల మంది.అయితే దర్శకధీరుడు రాజమౌళి కొన్ని సినిమాలలో అతిథి పాత్రలలో కనిపించారు అనే సంగతి చాల తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పచ్చు.ఆ సినిమాలు ఏంటంటే…రామ్ చరణ్,ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమాలో రాజమౌళి ఎత్తర జెండా అనే పాటలో కనిపించారు.
ఇక నితిన్ హీరోగా చేసిన సై సినిమాలో నల్ల బాలు అనుచరుడి పాత్రలో రాజమౌళి కనిపించారు.రైన్ బో సినిమాలో రాజమౌళి అతిథి పాత్రలో నటించడం జరిగింది.రామ్ చరణ్ హీరోగా చేసిన మగధీర సినిమాలో అనగనగా అనే సాంగ్ లో రాజమౌళి నటించారు.బాహుబలి మొదటి భాగంలో వైన్ సెల్లర్ గా రాజమౌళి నటించారు.నాని హీరోగా చేసిన మజ్ను సినిమాలో కూడా రాజమౌళి అతిథి పాత్రలో నటించడం జరిగింది.