Prabhakar Daughter Divija: బుల్లితెర ప్రేక్షకులకు నటుడు ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.పలు టీవీ సీరియల్స్ లో నటించి ప్రభాకర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.ప్రభాకర్ ఆపరేషన్ దుర్యోధన,మైసమ్మ ఐపీఎస్ వంటి సినిమాలలో కూడా ముఖ్య పాత్రలలో నటించారు.ఇక ఆయన కుమారుడు చంద్రహాస్ ఇటీవలే సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.చంద్రహాస్ నటించిన రామ్ నగర్ బన్నీ సినిమా అక్టోబర్ 3 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో చంద్రహాస్ నటనకు,డాన్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ రామ్ నగర్ బన్నీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా దివిజ ప్రభాకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించటం జరిగింది.రామానాయుడు స్టూడియో లో ఈమె డెబ్యూ మూవీ లాంఛనంగా ప్రారంభం అయ్యింది.వెంకటరామయ్య గారి తాలూకా,కేరాఫ్ సీతారాంపురం పేరుతొ వస్తున్నా ఈ సినిమాలో దినేష్ హీరోగా,దివిజా ప్రభాకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.సతీష ఆవాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
View this post on Instagram