Ram Charan: గేమ్ చేంజర్ సినిమాకు తన పారితోషకాన్ని తగ్గించుకున్న రామ్ చరణ్… దాని వెనుక ఉన్న ప్రత్యేక కారణం ఇదే

Ram Charan
Ram Charan

Ram Charan: టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా ఒకరు. రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ సినిమా ఘనవిజయం తర్వాత రామ్ చరణ్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అయితే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వచ్చిన ఆచార్య నిరాశపరిచినప్పటికీ అది సొంతంగా నిర్మించిన సినిమానే కావడంతో రామ్ చరణ్ పారితోషకం తీసుకోలేదు. అయితే గతంలో గేమ్ చేంజర్ (Game Changer) సినిమా కోసం రామ్ చరణ్ భారీ మొత్తంలో పారితోషికం (Remuneration) తీసుకుంటున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం తన పారితోషకాన్ని తగ్గించినట్లుగా తెలుస్తుంది. దీని వెనుక ఒక కారణం కూడా ఉందట. అయితే గతంలో రామ్ చరణ్ ఈ సినిమాకు గాను 100 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగిందని సమాచారం. కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు 65 కోట్లు పారితోషకం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీని వెనకాల ఒక ప్రత్యేక కారణం ఉందని తెలుస్తుంది. అయితే ముందుగా ఈ సినిమా బడ్జెట్ ను 300 కోట్లు అనుకున్నారట. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో అది కాస్త 500 కోట్లు అయ్యింది. దాంతో నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రామ్ చరణ్ తన పారితోషకాన్ని తగ్గించుకున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు శంకర్ కూడా తన పారితోషకాన్ని తగ్గించుకున్నట్లు తెలుస్తుంది. మొదట్లో 50 కోట్లు అనుకున్న ప్రస్తుతం శంకర్ 35 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.