Tollywood Heroine: యంగ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ (Sakshi Agarwal) రాజా రాణి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఈమె తెలుగులో కాలా, టెడ్డి వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. సినిమాలలో ఈమె చేసింది సైడ్ క్యారెక్టర్స్ అయినప్పటికీ ఈమెకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పలు సినిమాలలో హీరోయిన్గా కూడా సాక్షి అగర్వాల్ నటించింది. ఈమె తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో పలు సినిమాలలో నటించింది.
అలాగే రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా పాల్గొని మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈమె చివరగా కనిపించిన సినిమా భగీర. ఆ తర్వాత సాక్షి అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సాక్షి అగర్వాల్ పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.
తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్లి చేసుకుని అతనితో ఏడడుగులు వేసింది. ఈ విషయాన్ని స్వయంగా సాక్షి అగర్వాల్ తన ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్టుతో తెలిపింది. ప్రస్తుతం సాక్షి అగర్వాల్ కి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నేటిజెన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
View this post on Instagram