Todays Gold Rate: మన దేశ సంస్కృతి, సంప్రదాయంలో బంగారానికి చాలా ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. మన దేశ మహిళలకు బంగారం అంటే ఎంతో ప్రీతి. ప్రతి మహిళ కూడా తమ దగ్గర బంగారం ఉండాలని కోరుకుంటుంది. ఎవరి స్తోమతకు తగినట్లు వాళ్లు బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో పెళ్లి లేదా శుభకార్యాలు ఉన్న సమయంలో మహిళలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
అయితే గత కొంతకాలం నుంచి మన దేశం మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. గత వారం రోజుల నుంచి తగ్గినట్లే తగ్గి బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నాయి. బంగారం ధర ఔన్స్కు 20 డాలర్లకు పైగా తగ్గినట్లు సమాచారం.
దీంతో ఈరోజు గోల్డ్ రేటు 3333 డాలర్ల దగ్గర ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తున్నాయి. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములు రూ.89,900, 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములు రూ.98,800. నిన్న బంగారం ధర తులంపై 500 రూపాయలు పెరిగింది. ఈరోజు మన దేశం మార్కెట్లో వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. నిన్న కిలో వెండి పై 1000 రూపాయలు తగ్గింది. ఈరోజు మాత్రం కిలో వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది.