Todays Gold Rate: ట్రంప్ కీలక నిర్ణయంతో భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంత ఉందంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: మన దేశ మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. పండుగలు, శుభకార్యాలు సందర్భం ఏదైనా సరే మహిళలు ముందుగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగి ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. డోనాల్డ్ ట్రంప్ ప్రతికాల సుంకాల నేపథ్యంలో బంగారం ధరలు కూడా మార్కెట్లో ఆకాశాన్ని తాకుతున్నాయి.

అయితే ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ సంకాల పెంపును వాయిదా వేయడం అలాగే చైనా తో అమెరికాకు డీల్ ఫైనల్ అవ్వడం వంటి పరిణామాల కారణంగా మార్కెట్లో బంగారం రేట్లు మళ్లీ తగ్గుతున్నాయి. తాజాగా డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలకమైన నిర్ణయం బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. మన దేశ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది. వచ్చేనెల జూన్ 1వ తేదీ నుంచి యూరోపియన్ యూనియన్ వస్తువులపై 50% సుంకాలు విధిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

కానీ తాజాగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. జూలై 9 వరకు వాషింగ్టన్, యూరోపియన్ యూనియన్ మధ్య ఒప్పందం కుదురు చెప్పినందుకు గడువు తెలిపారు. దీని ప్రభావంతో సోమవారం రోజున ఒక శాతం వరకు పసిడి ధరలు దిగి వచ్చాయి. మన దేశ మార్కెట్లో కూడా పసిడి ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈరోజు పసిడి ధరలు ఒక్కసారిగా దిగి వచ్చాయి అని సమాచారం.నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ ధరపై రూ.440 తగ్గింది. దీంతో ఈరోజు తులం బంగారం ధర రూ.97,640. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ ధరపై రూ.400 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.89,500 గా ఉంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధరపై వేయి రూపాయలు పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.1,11,000 గా ఉంది.