Soaked Chickpeas: నానబెట్టిన శనగలను ప్రతిరోజు ఉదయం తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని నిపుణులు చెప్తున్నారు. నానబెట్టిన సెనగల్లో చాలా పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటివి నానబెట్టిన శనగలలో అధికంగా ఉంటాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది అలాగే మలబద్ధకం సమస్య కూడా తగ్గడంలో ఇవి సాయం చేస్తాయి. కడుపుని కూడా శుభ్రపరుస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్, ఖనిజాలు వంటివి శరీరాన్ని శక్తివంతంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి.
ప్రతిరోజు ఉదయం వీటిని తినడం వలన శరీరానికి కావాల్సిన పూర్తి పోషణ లభిస్తుంది. అందుకే నానబెట్టిన సెనగలను సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండడం వలన అవి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. దీంతో మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేసే వారికి లేదా శారీరక పని చేసే వారికి ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
వీటిలో తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఉండడం వలన అవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. డయాబెటిస్ రోగులకు ఇవి మంచి ఆహారంగా నిపుణులు చెప్తున్నారు. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఉండడం వలన అవి ఎముకలను దృఢంగా చేయడంలో సహాయపడతాయి. వీటిని ప్రతి రోజు తినడం వలన ఎముకల బలహీనత సమస్య కూడా తగ్గిపోతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే ప్రోటీన్, జింక్, ఇతర ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి అలాగే జుట్టును బలోపేతం చేయడంలో కూడా సహాయం చేస్తాయి.