PM Modi: 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు రూ.21 వేలు..నేడు కొత్త స్కీమ్ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

PM Modi

PM Modi: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశ ప్రజల కోసం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకోని వచ్చారు.ఇప్పుడు ఇదే క్రమంలో భాగంగా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ ను తీసుకోని రానుంది.ఈ స్కీమ్ ను డిసెంబర్ 9 సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హర్యానా పర్యటన సందర్భంగా ప్రారంభించనున్నారు.మహిళల సాధికారిత వారికి ఆర్ధిక చేయూతనిస్తూ ముందుకు తీసుకోని వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్ ఐ సి భీమా సఖి యోజన స్కీమ్ ను ప్రారంభిస్తుంది.

మహిళలను ఈ స్కీమ్ లో LIC ఏజెంట్లుగా చేర్చి వారికి నెల నెల స్థిరమైన ఆదాయం వచ్చేలా చేయడం ప్రభుత్వ లక్ష్యం.గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు ఉద్యోగాలు కల్పించి వారికి ఆర్ధిక సహాయం చేయడం ఈ పథకం ప్రభను లక్ష్యం.ఈ భీమా సఖి యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.7 వేల నుంచి రూ.21 వేలు రానున్నాయి.నేడు పానిపట్ లో ఈ పథకం ప్రారంభిస్తున్నారు.LIC భాగస్వామ్యంతో ఈ స్కీమ్ ను ప్రారంభిస్తున్నట్లు పీఎంవో పేర్కొన్నారు.18 నుంచి 70 ఏళ్ళ లోపు ఉన్న మహిళలు ఈ స్కీమ్ లో చేరేందుకు అర్హులు.అలాగే వారు తప్పనిసరిగా 10 వ తరగతి పాసై ఉండాలి.