Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా తాజాగా థియేటర్లలో రిలీజ్ అయ్యి రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం దేశం లో ఎక్కడ చుసిన పుష్ప ఫీవర్ కనిపిస్తుంది.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా భారీ విజయం సాధించిన బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఇక ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది.అలాగే మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో అందరిని ఆకట్టుకున్నారు.ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
పుష్ప 2 క్లైమాక్స్ చివరలో ఒక కొత్త పాత్ర సడన్ గా ఎంట్రీ ఇస్తుంది.ఈ పాత్ర పుష్ప పార్ట్ 3 కి కారణమవుతుంది అని కూడా వినిపిస్తుంది.అయితే క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఈ వ్యక్తి ఎవరు అని సామజిక మాధ్యమాలలో చర్చ జరుగుతుంది.కొంత మంది మాత్రం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అని అంటుంటే మరికొంత మంది పుష్ప సినిమాలో కీలక పాత్రలో కనిపించిన ఫహద్ ఫాసిల్ మళ్ళీ బ్రతికి వచ్చాడు అని అంటున్నారు.
పుష్ప పార్ట్ 2 క్లైమాక్స్ లో పుష్ప రాజ్,శ్రీవల్లి ఒక వివాహ వేడుకలో ఉన్న సమయంలో ఒక బాంబు పేలుడు వినిపిసుంది.సడన్ గా ఒక వ్యక్తి రిమోట్ పట్టుకొని స్క్రీన్ పై కనిపిస్తాడు.అయితే ఆ వ్యక్తి ముఖం మాత్రం కనిపించదు.దాంతో పుష్ప రాజ్ ను చంపేందుకు వచ్చింది ఎవరో కాదు భన్వర్ సింగ్ షెకావత్ అంటూ ఎవరికి తోచింది వారు ఉహించుకుంటున్నారు.అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విలన్ గా నటిస్తారు అని ప్రచారం కూడా వినిపిస్తుంది.ప్రస్తుతానికి ఇవన్నీ పుకార్లే అని చెప్పచ్చు.