Panipuri Seller: ఈ పానీపూరి వ్యాపారి వార్షిక ఆదాయం చూసి షాక్ అయినా అధికారులు.!

Panipuri Seller
Panipuri Seller

Panipuri Seller: తమిళనాడులో ని ఒక పానీపూరి వ్యాపారికి అధికారులు జిఎస్టి నమోదు చేసుకోమని నోటీసు పంపించడంతో అధి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా 20 లక్షల కంటే ఎక్కువ వ్యాపారం ఉన్న వాళ్లు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే ఆ పానీ పూరి వ్యాపారి వార్షిక ఆదాయం 40 లక్షలకు పైగా ఉండడంతో అధికారులు అతనికి జిఎస్టి నోటీసు పంపించారు. మామూలుగా అయితే రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు జీఎస్టీ పరిధిలోకి రావు.

స్ట్రీట్ ఫుడ్ అమ్మేవారికి, ఇలాంటి పానీపూరి వ్యాపారులకు జీఎస్టీ ఉండదు. కానీ ఆన్లైన్ లావాదేవీల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే ఎక్కువగా ఉంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ క్రమంలోనే తమిళనాడులోని పానీపూరి వ్యాపారికి ప్రభుత్వ అధికారులు జిఎస్టి నోటీసును పంపించారు. సదరు వ్యాపారి గత ఆర్థిక సంవత్సరంలో ఫోన్ పే, రోజర్ పే ద్వారా రూ. 40 లక్షల వ్యాపారం చేసినట్లు తెలిసింది. దాంతో అది గుర్తించిన అధికారులు అతనికి జీఎస్టీ నోటీస్ పంపించారు. పరిమితి దాటిన తర్వాత కూడా జిఎస్టి చేయించుకోకపోతే అటువంటి వారికి పదివేల రూపాయలు జరిమానా కూడా ఉంటుంది అంటూ నోటీసులో పేర్కొన్నారు.