Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుంచి ఫ్రాన్స్ కు అదిరిపోయే క్రేజీ అప్డేట్.!

Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ నటుడు విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తి అయినట్లు సమాచారం. సినిమా యూనిట్ ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ తో ఫాన్స్ లో అంచనాలను పెంచుతున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరో క్రేజీ పోస్టర్ ను సినిమా యూనిట్ రిలీజ్ చేశారు. రాత్రిపూట చలిలో మంట కాచుకుంటూ డప్పు దరువేస్తున్న పవన్ కళ్యాణ్ పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి మొదటి పాట జనవరి 6న ఉదయం 9 గంటల ఆరు నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడడం విశేషమని చెప్పొచ్చు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.