ఆనంద్ సినిమాలో హీరో రాజా నిజజీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా..ఇప్పుడు ఎలా ఉన్నాడో..ఏం చేస్తున్నాడో తెలుసా…

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమాలో హీరో రాజా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.రాజా తల్లితండ్రులు విశాఖపట్నానికి చెందిన వారు.తల్లి క్రిష్టియన్,తండ్రి హిందూ…వీరిద్దరూ ప్రేమించి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వివాహం చేసుకున్నారు.పెద్దల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోవడంతో వీళ్ళ ఇంటికి బంధువులు కూడా ఎవరు వచ్చేవారు కాదు.రాజాకు ఇద్దరు అక్కలు ఉన్నారు.ఊపిరితిత్తుల కాన్సర్ తో రాజా తల్లి రాజాకు 8 ఏళ్ళ వయస్సులోనే చనిపోయారు.ఆ తర్వాత వీళ్ళు హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు.ఆ తర్వాత రాజా తండ్రి వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయారు.ఆ తర్వాత విదేశాల నుంచి తిరిగి వచ్చిన రాజా తండ్రి వచ్చిన ఒక సంవత్సరానికి గుండెపోటు తో మరణించారు.రాజాకు 14 ఏళ్ళ వయస్సులో తండ్రిని కూడా కోల్పోయాడు.ఒకానొక దశలో రాజాతో పాటు అతని అక్కలు కూడా డిప్రెషన్ కు లోనై పురుగుల మందు తాగేశారు.

స్నేహితులు కొంత మంది వెంటనే ఆసుపత్రిలో చేర్చడంతో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.వాళ్ళ స్నేహితులు కొంత మంది అన్నిటికి చావే పరిష్కారం కాదు అంటూ వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చారు.రాజా ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్ లోని గ్రీన్ పార్క్ హోటల్ లో రెసెప్షనిస్ట్ గా పని చేసాడు.అలా ఒక సంవత్సరం పని చేసిన తర్వాత డిగ్రీ పూర్తి అయినా తర్వాత లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం సంపాదించాడు.ఆ ఉద్యోగానికి వచ్చిన 3500 మందిలో సెలెక్ట్ అయినా నలుగురిలో రాజా కూడా ఒకడు.మంచి ఉద్యోగంతో స్థిరపడిపోయిన డబ్బులు కూడా వెనుకేసుకున్నాడు రాజా.అక్కకు పెళ్లి కూడా చేసాడు రాజా.

Hero Raja Abel
Hero Raja Abel

ఆ తర్వాత నటుడు కావాలనే కోరికతో రెండున్నర ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి అమెరికా వెళ్లి థియేటర్ యాక్టింగ్ కోర్స్ లో చేరాడు.ఆ తర్వాత స్వదేశానికి వచ్చి చాల మంది నిర్మాతల చుట్టూ తిరిగిన కూడా అవకాశం రాలేదు.ఆ తర్వాత ముంబై వెళ్లి ఆల్బమ్స్ లో నాటకాలలో నటించేవాడు.ఒకసారి సికింద్రాబాద్ క్లబ్ లో నాటకం వేస్తున్న సమయంలో పాత్రికేయుల కళ్ళలో పడ్డాడు.ఆ రివ్యూ లు చూసిన రామానాయుడు గారు రాజాకు ఫోన్ చేయడం జరిగింది.ముంబైలో ఉన్నప్పుడు రాజాకు ఈ వి వి సత్యనారాయణ గారి అబ్బాయిలతో మంచి సంబంధాలు ఉండేవి.దాంతో ఓ చిన్నదానా అనే చిత్రంలో సెకండ్ హీరోగా అవకాశం దక్కించుకున్నాడు.ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లో సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో విజయం సినిమాలో హీరో గా నటించాడు.ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.ఇలా ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన రాజా 2014 లో అమృత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.ప్రస్తుతం హైదరాబాద్ లో పాస్టర్ గా పనిచేస్తున్నాడు రాజా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *