March 26, 2023

అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ..

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.సుమ బుల్లితెర మీద ప్రసారం అయ్యే చాల షోలతో ప్రేక్షకులకు మెప్పించి వారి మనసులకు దగ్గరయ్యారు.కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించి ఈవెంట్స్ కు కూడా యాంకరింగ్ చేస్తూ తన మాటలతో అందరిని ఆకట్టుకుంటారు.ఎన్నో టీవీ షో లకు యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్నారు.

ఇప్పటి వరకు కానీ లేక భవిష్యత్తులో కానీ యాంకరింగ్ లో సుమ కు సాటిగా ఎవరు కూడా కనిపించడం లేదు.స్టార్ హీరో లకు సంబంధించిన ఈవెంట్లు కూడా చేస్తూ తన మాటలతో అందరిని మైమరపింప చేస్తారు సుమ.సుమ మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగు చక్కగా మాట్లాడుతూ తెలుగు ప్రజలకు చాల దగ్గరయ్యారు.ఇదివరకే సుమ కొన్ని సినిమాలలో కూడా నటించడం జరిగింది.

అయితే తాజాగా సుమ ఒక సినిమాలో నటిస్తున్నారు.ఇటీవలే దీనికి సంబంధించిన టైటిల్ తో ఉన్న పోస్టర్ ను హీరో రామ్ చరణ్ విడుదల చేసారు.అయితే ఈ సినిమాకు జయమ్మ పంచాయితీ అనే పేరు ను ఫిక్స్ చేసారు చిత్ర యూనిట్.ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లో సుమ సీరియస్ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నారు.ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం మరియు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.అయితే సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా కోసం ఆమె అభిమానులు చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *