వెంకటేశ్ అంటేనే క్లాస్ నుంచి మాస్ వరకు మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. ఇక ఫ్యామిలీ మూవీస్ కు ఆయనకు కొడువే లేదు. ఎక్కువగా ఫ్యామిలీకి ఆద్యాంతం ఎంటర్ టైనర్ ఇవ్వడంలో ఆయన స్టైలే వేరు. ప్రేక్షకులను కదలనీయకుండా చేస్తారు. ఆయనతో నటించే నటీ మణులు, అతిథి పాత్రలు పోషించే వారు కూడా అంత సెలక్ట్‌డ్ ఉంటారు. ఇటీవల బాగా వైరస్ అవుతుంది ఒక అతిథి పాత్రపైనే అదెవరంటే..
వెంకటేశ్ త్రిష జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా మూవీ 2007లో విడుదలైన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’. అలనాటి సావిత్రీ, ఎన్టీఆర్ తీసిన చిత్రం మిస్సమ్మలోని పాటలోని చరణంతో ఈ సినిమా డైరెక్ట్ చేశారు సెల్వ రాఘవన్. కోట శ్రీనివాస్ రావు, సునీల్, శ్రీరాం, కలర్స్ స్వాతి ఇలా ప్రముఖంగా నటించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మూడు నంది, ఒక ఫిలింఫేర్ అవర్డు సొంతం చేసుకుంది.

ఇక అందులో త్రిషకు చెల్లెలుగా స్వాతితో పాటు మరొకరు నటించారు. అప్పుడే ఇండస్ర్టీలోకి అడుగుపెడుతున్న హరితేజ. అప్పటికే బుల్లి తెరపై యాంకర్ గా హరితేజకు గుర్తింపు ఉంది. కొన్ని సీరియల్స్ లో ఆమె నటనకు మంచి గుర్తింపే వచ్చిందనడంలో సందేహం లేదు. తర్వాత బిగ్ స్ర్కీన్ పై ఆమె చాలా బిజీ అయ్యారు. సూపర్ సింగ్, ఫిదా, పండగ చేస్కో, రాజాది గ్రేట్, దువ్వాడ జగన్నాథం(డీజే), నేనే రాజు నేనే మంత్రి, దమ్ము, నేనొక్కడినే (1), అఆ, తదితర షోలు, మూవీస్ లో ఆమె ప్రముఖంగా కనిపించారు. ఇక పండగ చేస్కోలో ఆమె రోల్ వేరేలెవల్ అసలు. రాజాదిగ్రేట్ లో కూడా మంచి ఫర్ఫామెన్స్ ఇచ్చారు.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో పెద్ద స్కోప్ ఉన్న పాత్రకానప్పటికీ మంచి డైరెక్టర్, గుర్తింపు ఉంటుంది ఆమె ఆసక్తి చూపారు. ఏది ఏమైనా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో హరితేజ ముందువరుసలో నిలుస్తారనడంలో సందేహం లేదు.. అలాగే నటన విషయంలో ఆమె కనబరుస్తున్న ఆసక్తిపై కూడా ఇండస్ర్టీలో మంచి టాక్ ఉంది. మంచి నటనతో ఆకట్టకునే ఆమెకు అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. చాలా మూవీస్ కు ఆమె ఓకే చెప్పిందని, ఇప్పుడు బిజీగా ఉన్న సైడ్ నటి అని కూడా ఇండ్రస్ర్టీ మంచి గుర్తింపు ఇచ్చింది.