రోజు రోజుకు పడిపోతున్న ఏజెంట్ సినిమా కలెక్షన్స్ చూసి షాక్ అవుతున్న అక్కినేని అభిమానులు…ఏ ఏరియాలో ఎంతంటే….

Agent Movie Collections

Agent: ఎన్నో ఆశలతో అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయింది.ఈ సినిమాతో అఖిల్ ఖాతాలో మరో డిసాస్టర్ చేరిందని చెప్పచ్చు.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా కలెక్షన్లు మాత్రం చెప్పుకోదగినవిగా లేవు అని తెలుస్తుంది.

రోజు రోజుకు ఈ సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ చూసి అక్కినేని అభిమానులు షాక్ అవుతున్నారు.ఏప్రిల్ 28 న రిలీజ్ అయినా ఈ సినిమాలో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ అంచనాలు ఉన్నప్పటికీ సినిమా మొదటి రోజే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రూ.4 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను రాబట్టింది.

Agent Movie Collections

ఇక రెండో రోజు రూ.67 లక్షలు,మూడో రోజు రూ.43 లక్షలు,ఇక నాలుగో రోజు కేవలం రూ.17 లక్షలు కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా.అలాగే అయిదవ రోజు రూ.5 లక్షలు,ఆరవ రోజు రూ.4 లక్షలు మాత్రమే ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి.ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ రేంజ్ లో బజ్ నెలకొనడంతో అఖిల్ కెరీర్ లోనే ఈ సినిమాకు హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ.36 .20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.నైజం లో రూ 10 బిజినెస్ జరగగా,సీడెడ్ లో రూ 4 .50 కోట్లు,ఆంధ్ర లో రూ 14 .80 కోట్లు బిజినెస్ జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *