Vastu Tips: ఇంటి నిర్మాణం తో పాటు ఇంట్లోనీ వస్తువుల విషయంలో కూడా వాస్తు శాస్త్రంలో అనేక నియమాలు చెప్పబడ్డాయి. వీటిని పాటించకపోతే అనేక ఆర్థిక ఇబ్బందులు మరియు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఇంట్లో ప్రతి వస్తువుని కూడా వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను అనుసరించి అమర్చుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో బరువైన వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో బరువైన వస్తువులను పెట్టడానికి కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాల్సిందే. ఇంట్లో ఫ్రిడ్జ్, బీరువా మరియు డైనింగ్ టేబుల్ వంటి బరువైన వస్తువులను పొరపాటున కూడా ఈ ప్రదేశాలలో పెట్టకూడదు.
ఇంటి నిర్మాణంలో వాస్తుకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో ఇంట్లో ఉన్న వస్తువులకు కూడా వాస్తు శాస్త్రంలో అంతే ప్రాముఖ్యత ఉంది. పొరపాటున కూడా కొన్ని బరువైన వస్తువులను కొన్ని దిశలలో పెట్టడం వలన అనేక ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో బరువైన వస్తువులను పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాస్తు శాస్త్రంలో చెప్పబడిన కొన్ని నియమాలను పాటించాలి. ముఖ్యంగా ఇంట్లో ఫ్రిడ్జ్, బీరువా లేదా డైనింగ్ టేబుల్ వంటి బరువైన వస్తువులను పొరపాటున కూడా ఈశాన్య దిశలో పెట్టకూడదు అని వాస్తు శాస్త్రం నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో వీలైనంతవరకు ఈశాన్యం మూల ఖాళీగా ఉండేలాగా జాగ్రత్తపడాలి.
బరువైన వస్తువులను ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం మూలలో పెడితే అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంటి మధ్య భాగంలో కూడా బరువైన వస్తువులను పెట్టకూడదు. చాలామంది హాల్ మధ్యలో బరువైన సోఫాలను అలాగే డైనింగ్ టేబుల్స్ను పెడతారు. కానీ అలా పెట్టకూడదు. ఇటువంటి బరువైన వస్తువులను నైరుతి దిశలో మాత్రమే పెట్టాలి. అందుకే బరువైన బీరువాలను బెడ్ రూంలో పెడుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్, నైరుతి దిశలో ఉంటుంది కాబట్టి బరువైన వస్తువులను కూడా ఆ దిశలో పెట్టుకోవాలి. పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి దిశలలో బరువైన వస్తువులను పెట్టుకోవడం మంచిది. అలాగే ఇంటి టెర్రస్ పైన కానీ లేదా ఉత్తరం వైపున కానీ బరువైన వస్తువులను పెట్టకూడదు. ఇలా పెట్టడం వలన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.