Todays Gold Rate: బంగారం కొనాలనుకునే మహిళలకు ఒక మంచి శుభవార్త. వరుసగా నాలుగో రోజు కూడా మన దేశ మార్గంలో బంగారం ధరలు తగ్గాయి. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. బులియన్ మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం బంగారం కొనడానికి ఇది సరైన సమయం.
అంతర్జాతీయంగా సానుకూలత పెరగడం అలాగే దేశీయంగా బంగారం గిరాకీ తగ్గడం కారణంగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. అమెరికా ఫెడరల్ కోర్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సంఘాల అమలుకు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఇచ్చిన ఈ తీర్పు తర్వాత గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతున్నాయి.
హైదరాబాదులో వరుసగా నాలుగవ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. నాలుగు రోజుల్లోనే స్వచ్ఛమైన తులం బంగారంపై రూ.1400 ధర తగ్గింది. ఇక ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.97,040, 22 క్యారెట్ల బంగారంపై ఈ నాలుగు రోజులలో రూ.950 తగ్గింది. దీంతో ఈరోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.88,950 గా ఉంది. ఇక వెండి కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి రూ.1,10,900 గా ఉంది.