No Petrol: మన దేశ రాజధాని ఢిల్లీలో జులై 1వ తేదీ నుంచి కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆటోమేటిక్ నెంబర్ల ద్వారా లైఫ్ టైము అయిపోయిన వాహనాలను గుర్తించి వాటికి అన్ని పెట్రోల్ బంకులలో ఇంధనం నింపడానికి అనుమతిని ఇవ్వడం లేదు అని ప్రకటించింది. అయితే ఇందులో 10 ఏళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు అలాగే 15 ఏళ్ల కంటే పాత పెట్రోల్ వాహనాలను లైఫ్ టైం అయిపోయిన వాహనాలుగా గుర్తిస్తారు. అయితే నవంబర్ 1 నుంచి ఈ నియమాలను గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనీ పట్ల కూడా ప్రభుత్వం విస్తరించబోతుంది.
ఎన్సీఆర్ ప్రాంతాలను ఏప్రిల్ 1, 2026 నుంచి కవర్ చేయనున్నారు. సీఏ క్యు ఎం సభ్యుడు డాక్టర్ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ ఢిల్లీలో ఆటోమేటిక్ కెమెరాల ద్వారా మొత్తం 500 కేంద్రాలలో వాహన డేటా రియల్ టైం ట్రాకింగ్ సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఢిల్లీలో ఈ వ్యవస్థ ద్వారా 3.63 కోట్లకు పైగా వాహనాలను తనిఖీ చేసినట్లు అలాగే వాటిలో 4.90 లక్షల వాహనాలు లైఫ్ టైం అయిపోయిన వాహనాలుగా నిలిచిపోయినట్లు గుర్తించినట్లు తెలిపారు.
అందులో మొత్తం 29.52 లక్షల వాహనాలు కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాన్ని పునరుద్ధరించుకున్నాయని ఇక వాటి ఫలితంగా మొత్తం రూ.1.68 కోట్ల విలువైన చలాన్లను జారీ చేసినట్లు కూడా ఆయన తెలిపారు. ఢిల్లీ రవాణా శాఖ డేటాను పర్యవేక్షించడానికి ఫ్లాగ్ చేయబడిన వాహనాలతో ఇంధన స్టేషన్లను గుర్తించడానికి వంద ప్రత్యేక బృందాలతో కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ రవాణా శాఖ వంద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గిల్లి నగరంలో ఫ్లాగ్ చేయబడిన వాహనాలతో ఇంధన స్టేషన్లను గుర్తించడానికి కఠినమైన చర్యలను చేపట్టింది.