Chiranjeevi Family: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఒక భారీ ఫాంటసీ సినిమాను చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.చిరంజీవి వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను చేసారు.ఎన్నో అంచనాలతో ఆగష్టు 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ప్రస్తుతం భోళా శంకర్ సినిమా నెట్ ఫ్లిక్ ఓటిటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.అయితే నాగబాబు కుమారుడు వరుణ్ పెళ్లి నవంబర్ 1 న ఇటలీ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ పెళ్లి కోసం చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీ చేరుకున్నారు.అక్టోబర్ 30 నుంచే వరుణ్,లావణ్య పెళ్లి సెలెబ్రేషన్స్ మొదలు కానున్నాయి.ఇటలీ లో చిరంజీవి తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు.తాజాగా చిరంజీవి ఇటలీ లోని కొన్ని ఫోటోలను షేర్ చేసుకున్నారు.ఈ ఫోటోలలో చిరంజీవి,సురేఖ,రామ్ చరణ్,ఉపాసన,సుస్మిత,శ్రీజ,ఉపాసన ఫ్యామిలీ కూడా ఉన్నారు.
ఇక వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.వీరిద్దరి నిశ్చితార్ధం జూన్ 9 న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది.డెస్టినేషన్ వెడ్డింగ్ ను జరుపుకుంటున్న వరుణ్,లావణ్య తమకు ఎంతో ఇష్టమైన దేశం ఇటలీ లో పెళ్లి చేసుకుంటున్నారు.కొద్దీ మంది సమక్షంలో ఈ జంట పెళ్లి తో ఒక్కటి కానున్నారు.
View this post on Instagram