Ticket Prices: సినిమా టికెట్ ధర పెంచేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం.. ఏ సినిమాకు ఎంత పెంచారో తెలుసుకోండి.!

Ticket Prices
Ticket Prices

Ticket Prices: సంక్రాంతి పండుగ సందర్భంగా పలు సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాలకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సంక్రాంతి బరిలో మొదటి స్థానంలో ఉన్న సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Changer) హీరోగా నటించిన గేమ్ చేంజర్ (Game Changer). ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ గా కనిపించనున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇక మొదటి వారం రోజులు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 135, మల్టీప్లెక్స్ లో రూ. 175 టికెట్ల రేట్లను పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరిమిత బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూ టికెట్ల రేట్లు రూ. 600 గా నిర్ణయించింది. నాకు మహారాజ్ సినిమాతో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా ఈ సంక్రాంతి బరిలో ముందున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాలతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దుల్కర్ సల్మాన్, బాబి డియోల్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో ఉండడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. ఇక ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ. 110, మల్టీప్లెక్స్ లో రూ. 135 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) అనే సినిమా కూడా ఈ సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ. 75, మల్టీప్లెక్స్ లో రూ. 100 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉంటే అటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలు అలాగే టికెట్ల రేట్లు పెంచేందుకు అనుమతిని నిరాకరించింది.