Tollywood Heorine: ఒకప్పుడు బుల్లితెర మీద న్యూస్ రీడర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) లో క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈమె డిసెంబర్ 31న తన పుట్టిన రోజున జరుపుకుంది. ఈమె మరెవరో కాదు హీరోయిన్ ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar). ఈమె అసలు పేరు సత్యప్రియ భవాని. ఈమె 1989 డిసెంబర్ 31న జన్మించింది. సాధారణ కుటుంబంలో పుట్టిన ఈమె తన చదువు పూర్తయిన తర్వాత ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పనిచేసింది.
ఆ తర్వాత ఈమె దో కాదల్ హై అనే సీరియల్ తో ప్రేక్షకులను అలరించింది. ఈ సీరియల్ లో ఈమె పాత్రకు మంచి గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో ఈమె రత్నకుమార్ దర్శకత్వంలో మే యద మాన్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ఈ సినిమాలో మధుమిత పాత్రలో ఈమె మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కడకుట్టి సింగం, రాక్షసుడు, మాఫియా ఇలా పలు సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఈమె పలు సినిమాలలో నటించింది. కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంది. ఇటీవలే డిమాంటి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
View this post on Instagram