Aadi Pinishetty: దర్శకుడు సుకుమార్, హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం (Rangasthalam) సినిమా గురించి అందరికీ తెలిసిందే. 1980 నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించింది. అప్పట్లో ఈ సినిమా 210 కోట్లు వసూళ్లు రాబట్టింది. మైత్రి మూవీస్ బ్యానర్ పై రవిశంకర్, సివి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది.
హీరో ఆది పినిశెట్టి (Aadi Pinishetty), ప్రకాష్ రాజ్, అనసూయ, జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించారు. ఇందులో హీరో రామ్ చరణ్ (Ram Charan) చిట్టిబాబు పాత్రలో తన అద్భుతమైన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు ఆది పినిశెట్టి. ఇతను టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించాడు. అయితే ఆది పినిశెట్టి భార్య కూడా ఫేమస్ హీరోయిన్ అన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు.
ఆమె మరెవరో కాదు నిక్కి గల్రాణి (Nikki Galrani). వీరిద్దరూ 2022లో మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. ఈమె తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో కూడా ఈమె కొన్ని సినిమాలలో నటించింది. సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి సినిమాలో ఈమె పల్లవి పాత్రలో నటించింది. ఆ తర్వాత వచ్చిన మలుపు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. పెళ్లి తర్వాత కూడా ఈమె సినిమాలు చేస్తుంది.
View this post on Instagram







