Health Tips: వంట కోసం ఉపయోగించే వంట నూనె నుంచి కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. అమెరికా ప్రభుత్వం నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం బయటపడింది. ఈ పరిశోధనలో వంటనూనె క్యాన్సర్కు కారణం అవుతుందని తేలింది. ముఖ్యంగా యువత దీని బారిన పడే అవకాశం ఉందని చెప్తున్నారు. గట్ అనే మెడికల్ జర్నల్ నిర్వహించిన అధ్యయనంలో ప్రొద్దుతిరుగుడు, ద్రాక్ష విత్తనాలు, కనోల, మొక్కజొన్న వంటి విత్తనాల నుంచి తీసిన నూనెను వంటకు ఉపయోగించడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది.
ఈ అధ్యాయంలో వాళ్లు బయో ఆక్టివ్ లిపిడ్లు ఎక్కువగా ఉన్న 80 మంది పెద్దపేగు క్యాన్సర్ రోగులపై పరిశోధనలు చేయడం జరిగింది. విత్తన నూనెలు విచ్ఛిన్నం కావడం వలన వారిలో బయో ఆక్టివ్ లిపిడ్లు పెరుగుతాయని పరిశోధన లో బయటపడింది. ఆరోగ్యం పై ఫీడ్ ఆయిల్స్ హానికరమైన ప్రభావం చూపుతాయని మునుపటి పరిశోధనలో కూడా తేలింది. ఇవి శరీరంలో మంటను కలిగించి క్యాన్సర్ ను పెంచే అవకాశం ఉందని తేలింది. విత్తన నూనెలను ఎక్కువగా తీసుకోవడం వలన కడుపులో మంట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఈ పరిశోధనలో తేలింది. ఆరోగ్యకరమైన ఆహారం కోసం మీరు ఆలివ్ ఆయిల్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ వంటి తేలికపాటి నూనెను వంటకు ఉపయోగించుకోవచ్చు. ఒక గొప్ప ఎంపిక అని చెప్పొచ్చు.