Drushyam Movie: చాల మంది చిన్నారులు చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన వాళ్లలో ఎస్తేర్ కూడా ఉంది.ఎస్తేర్ అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేరు కానీ దృశ్యం (Drushyam) సినిమాలో చిన్నారి అంటే బాగా గుర్తుపట్టగలరు.హీరో వెంకటేష్ (Venkatesh) ,మీనా (Meena) జంటగా నటించిన దృశ్యం సినిమా 2014 లో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది.
ఇందులో వెంకటేష్ మీనా జంటకు ఇద్దరు కూతుర్లు.వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన చిన్నారి పేరే ఎస్తేర్.దృశ్యం సినిమాలో ఎస్తేర్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది.దృశ్యం సినిమా రిలీజ్ అయ్యి ఏడు సంవత్సరాలు అయింది.ఇప్పుడు ఎస్తేర్ వయస్సు 18 సంవత్సరాలు.ఎస్తేర్ తెలుగు తో పాటు మలయాళ సినిమాలలో కూడా నటించడం జరిగింది.ప్రస్తుతం ఎస్తేర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.
అయితే మాలయంలో హీరోయిన్ గా సినిమా చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.ఎస్తేర్ (Esther Anil) కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.ఎస్తేర్ లేటెస్ట్ ఫోటోలు చుసిన నెటిజన్లు చాల అందంగా ఉంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.మరి తెలుగులో హీరోయిన్ గా ఎస్తేర్ ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తుందో వేచి చూడాల్సిందే.
View this post on Instagram