Simran Natekar: ప్రతి సినిమాలోనూ ఈ నగరానికి ఏమైంది అనే డైలాగ్ వినబడుతుంది.ప్రతి సినిమా ప్రేక్షకుడికి ఈ డైలాగ్ పరిచయమే అని చెప్పచ్చు.ప్రతి థియేటర్ లోను మొదట వచ్చే యాడ్ ఇదే అన్న సంగతి అందరికి తెలిసిందే.ధూమపానానికి తప్పదు భారీ మూల్యం అనే యాడ్ లో ఒక చిన్నారి కనిపిస్తుంది.అయితే ఈ యాడ్ లో నటించిన చిన్నారి ఎవరు..ప్రస్తుతం ఆమె ఎలా ఉంది…ఏం చేస్తూ ఉంటుంది అనే సంగతి చాల మందికి తెలియదు.
ఈ యాడ్ లో కనిపించే చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్ (Simran Natekar).ఈమె ఇప్పటికే పలు హిందీ సీరియల్స్ లో నటించడం జరిగింది.ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా సినిమాలలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ లో ఈమె పూజ పాత్రలో నటించడం జరిగింది.క్రిష్ 3 వంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాలో కూడా ఈమె నటించడం జరిగింది.ప్రస్తుతం ఈమె తెలుగు లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుందట.
ఒక టాప్ బ్యానర్ సిమ్రాన్ నటేకర్ ను హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చెయ్యాలని సన్నాహాలు చేస్తుందని సమాచారం.అయితే గత కొంత కాలం నుంచి ఈమె తెలుగు సినిమాలలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అనే వార్తలు చాలానే వినిపించాయి.ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న వార్త నిజమే అయితే ఆమె కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
View this post on Instagram