సినిమా ఇండస్ట్రీలో హీరో,హీరోయిన్లు ఫామ్ లో ఉండాలంటే కథలను ఎంపిక చేసుకోవడం చాల ప్రధానం అని చెప్పచ్చు.సినిమా ఇండస్ట్రీలో నటీనటులు తమ కెరీర్ కు ఉపయోగపడే కథలు,పాత్రలు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.నటనకు స్కోప్ లేని పాత్రలు చేసుకుంటూ పొతే అతి తక్కువ సమయంలోనే ఫెడ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది.
అలా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్లలో గౌరీ ముంజల్ కూడా ఒకరు అని చెప్పచ్చు.ఢిల్లీ కి చెందిన ఈ అమ్మడు హీరో అల్లు అర్జున్ కు జోడిగా బన్నీ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈమెకు తెలుగుతో పాటు కన్నడ లో కూడా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.కానీ వరుసగా ప్లాప్ ల కారణంగా ఈమె అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది.ఈమె తెలుగుతో పాటు కన్నడ,మలయాళం,తమిళ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఏం లాభం లేకుండా పోయింది.
దాంతో కెరీర్ స్టార్ట్ అయినా ఆరు సంవత్సరాలకే గౌరీ ముంజల్ సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది.ఈమె తెలుగులో శ్రీకృష్ణ 2006 ,గోపి గోడ మీద పిల్లి,కౌసల్య సుప్రజ రామ సినిమాలలో నటించడం జరిగింది.ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న గౌరీ తన ఆసక్తి అయినా బిజినెస్ లో రాణిస్తూ ఫ్యామిలీ తో ఢిల్లీలో ఉంటుందని సమాచారం.నాలుగు పదుల వయస్సు దగ్గర పడుతున్న ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్పచ్చు.