ఒక్కప్పుడు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత హీరో హీరోయిన్ గా చేసిన వాళ్ళు కూడా చాల మందే ఉన్నారు.ఇక కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి కెరీర్ పరంగా సినిమాలకు దూరంగా కూడా చాల మంది ఉంటున్నారు.మరికొందరు సినిమాలలో రీ ఎంట్రీ కి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.అయితే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గోవిందు అందరివాడేలే సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ అందరికి గుర్తుండే ఉంటుంది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.కృష్ణ వంశి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ కు చెల్లెలి పాత్రలో నటించిన చిన్నారి తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ ఫ్యామిలీ ఫారెన్ లో సెటిల్ అవుతారు.అక్కడ నేటివిటీ కి తగినట్లుగా చైల్డ్ ఆర్టిస్ట్ ఆయేషా కుదుస్కర్ ను హీరో చెల్లెలిగా ఎంపిక చేసారు దర్శకుడు.ఇక ఈ సినిమాలో అవకాశం రావడంతో అయేషా మంచి గుర్తింపును తెచ్చుకుంది.

సినిమాలో ఫారెన్ నుంచి వచ్చిన పాష్ అమ్మాయిల నటించింది.సినిమాలో హీరో మరియు అయేషా మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.అయితే ఈ సినిమా కంటే ముందు అయేషా హిందీ లో పలు సినిమాలలో మరియు సీరియల్స్ లో నటించడం జరిగింది.అయేషా హృతిక్ రోషన్ అగ్నిపత్ సినిమాలోనూ నటించడం జరిగింది.ప్రస్తుతం అయేషా సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది.

సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే అయేషా తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను షేర్ చేయడం జరిగింది.ఆ సినిమా వచ్చినప్పటికీ ఇప్పటికి అయేషా గుర్తుపట్టనంతగా మారిపోయింది అని చెప్పచ్చు.