Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. ఈ ఫ్రూట్ లో పెద్ద మొత్తంలో ఫైబర్ తో పాటు ఫైటో న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, కెరోటిన్, ప్రోటీన్లు చాలా పుష్కలంగా ఉంటాయి. మధుమేహం, క్యాన్సర్, డెంగ్యూ లేదా కడుపు సంబంధిత సమస్యల నుంచి ఈ డ్రాగన్ ఫ్రూట్ కాపాడుతుంది. ఈ ఫ్రూట్ ని పోషకాల స్టోర్ హౌస్ అని కూడా అంటారు. ఫైబర్, ప్రోటీన్లు ఇందులో అధికంగా లభిస్తాయి.
మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ (Dragon Fruit) లో విటమిన్ సి అధికంగా ఉండడం వలన అది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఈ ఫ్రూట్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి.
ఇన్సులిన్ రెస్టినేన్స్ ను డ్రాగన్ ఫ్రూట్ పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ ఫ్రూట్ ను రోజు తినడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మెదడు పనితీరు కూడా మెరుగు పడుతుంది. మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వలన ఎముకలు కూడా బలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన అవి ఫ్రీ రాడికల్స్ నీ నాశనం చేసి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను దరిచేరకుండా చూస్తాయి.