Health Tips: ప్రతి జీవ ప్రాణికి నీరు చాలా ముఖ్యం. ప్రతి మనిషి ఒక్కరోజులో కొంత మొత్తంలో నీళ్లు తాగాలి. అయితే నీళ్లు ఎక్కువగా తాగడం వలన శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అలాగే ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తీసుకోవడం వలన శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు పోతాయి. అయితే మోతాదులో మించిన నీళ్లు ఎక్కువగా తాగడం వలన శరీరానికి ప్రతికూల ప్రభావం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
శరీరంలో నీళ్లు తక్కువగా ఉంటే దాన్ని డీహైడ్రేషన్ అని అలాగే ఎక్కువగా ఉంటే దాన్ని ఓవర్ హైడ్రేషన్ అని అంటారు. ఎక్కువగా నీళ్లు తాగడం అలాగే మూత్రపిండాలు ఎక్కువగా నీటిని నింపుకోవడం వలన ఓవర్ హైడ్రేషన్ కలుగుతుంది. దీనివలన శరీరంలో సోడియం తగ్గిపోయి అల్పోషణస్థితి ఏర్పడుతుంది. శరీరం నుండి అవాంఛిత పదార్థాలతో పాటు మూత్రం ద్వారా కూడా నీరు బయటకు వెళ్తుంది. ఇది సక్రమంగా జరగని క్రమంలో శరీరంలో నీళ్లు ఎక్కువగా ఉండిపోయి ఆరోగ్యం పాడయ్యేలా చేస్తుంది. . అధిక నీళ్లు శరీరంలో ఉండడం వలన వికారం, వాంతులు, మైకము, కండరాల ఉద్రిక్తత అధికంగా మగతగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లు చేతులు వాపు కూడా గురవుతాయి.