పర్యటనలో పోలీసు అధికారి పరిస్థితి చూసి చలించిన పవన్ కళ్యాణ్…నెట్టింట్లో ప్రశంసల వర్షం..ఫోటోలు వైరల్..

pawan kalyan gives energy drink to gannavaram ci prasanth kumar photos goes viral

pawan kalyan gives energy drink to gannavaram ci prasanth kumar photos goes viral
Pawan Kalyan: వేసవిలో బయట చాలా వేడిగా ఉంటుంది మరియు ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల మధ్య బయటకు వెళ్లాలంటే భయంగా ఉంటుంది. కొందరు వ్యక్తులు ఎండలో బయట పని చేయాల్సి ఉంటుంది, ఇది నిజంగా వేడిగా ఉన్నప్పటికీ, ఇది కఠినంగా ఉంటుంది.మూడు నాలుగు రోజుల ముందు ఎంతో చల్లగా ఉన్న వాతావరణం కాస్త ప్రస్తుతం మండే ఎండలతో పొగలు కక్కుతోంది.ఇటువంటి పరిస్థితుల్లో రోడ్ల పని డ్యూటీలు నిర్వహించే వారిని అలాగే రోడ్ల మీద పని చేసే వారిని చూస్తే వారు పెద్ద సాహసమే చేస్తున్నారు అని అనిపిస్తుంది.

ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల పర్యటనలు ఉన్న సమయంలో అక్కడ విధులు నిర్వహించే అధికారులు మండుటెండలో పడే ఇబ్బందులను ఊహించుకోవచ్చు.ఇటీవలే తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లాలో పర్యటించడం జరిగింది..ఈ పర్యటనలో చోటు చేసుకున్న ఒక సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటుంది.పవన్ కళ్యాణ్ పర్యటనలో పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో అక్కడ పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసారు.

pawan kalyan gives energy drink to gannavaram ci prasanth kumar photos goes viral
ఆ పర్యటనలో మండుతున్న యెండల కారణంగా అక్కడ ఉన్న పొలిసు సిబ్బంది మరియు ప్రజలు అలసటకు గురైన పరిస్థితులు కనిపించాయి.ఎండలో చమటలు కక్కుతూ విధులు నిర్వహిస్తున్న పి గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్ అలసటగా ఉండడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గమనించడం జరిగింది.ప్రశాంత్ కుమార్ కు పవన్ కళ్యాణ్ వెంటనే ఎనర్జీ డ్రింక్ ను అందించారు.వెంటనే ఆ డ్రింక్ తాగి రిలాక్స్ అయ్యారు సిఐ ప్రశాంత్ కుమార్.ఇక ఈ సందర్భానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో పవన్ కళ్యాణ్ మంచి మనసుకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *