Varun Tej- Lavanya Tripathi: గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న టాలీవుడ్ ప్రేమ పక్షులు నవంబర్ 1 న ఇటలీ లో వివాహం తో ఒకటి కాబోతున్నారు.వరుణ్,లావణ్య పెళ్లి సెలెబ్రేషన్స్ అక్టోబర్ 30 నుంచే స్టార్ట్ అయినా సంగతి తెలిసిందే.ఇక ఈ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో భాగంగానే అక్టోబర్ 30 సోమవారం రాత్రి ఘనంగా కాక్ టైల్ పార్టీ జరిగింది.
ఈ కాక్ టైల్ పార్టీ లో వరుణ్,లావణ్య తో పాటు రాంచరణ్,ఉపాసన దంపతులు,చిరంజీవి సతీమణి సురేఖ,అల్లు అర్జున్ దంపతులు,సాయి ధరమ్ తేజ్,లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ కాక్ టైల్ పార్టీ లో వరుణ్,లావణ్య తెలుపు రంగు దుస్తుల్లో కనిపించారు.రామ్ చరణ్,అల్లు అర్జున్,సాయి ధరమ్ తేజ్ స్టైలిష్ దుస్తుల్లో కనిపించి ఈ పార్టీ లో సందడి చేసారు.
వీరిద్దరి కాక్ టైల్ పార్టీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్ #varnlav హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు.అక్టోబర్ 31 న ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో భాగంగా హల్దీ మరియు మెహందీ ఫంక్షన్స్ జరగనున్నాయి.ఇక ఈ వేడుకలో పాల్గొనే అతిథులకు స్పెషల్ డ్రెస్ కోడ్ ఉందని తెలుస్తుంది.నవంబర్ 1 బుధవారం మధ్యాహ్నం 2 .48 గంటలకు వరుణ్,లావణ్య పెళ్లి జరగనుంది.ఈ పెళ్లి వేడుకకు మెగా,అల్లు కుటుంబాలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారని సమాచారం.
View this post on Instagram