Tollywood: గతంలో హీరోల భార్యల గురించి వారి కుటుంబసభ్యుల గురించి తెలుసుకోవాలి అనుకున్న ఎవ్వరికీ తెలిసేది కాదు.కానీ టెక్నాలజీ మారిన తర్వాత సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరి సినిమా తారల పర్సనల్ లైఫ్ గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది.సినిమా తారల గురించి ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది.వాళ్ళు ఏం చేస్తుంటారు..వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ ఎలా ఉంటారు..ఏం చేస్తుంటారు..ఇలా ప్రతి విషయం తెలుసుకోవాలి అనే ఆసక్తి ప్రతి అభిమానిలోను ఉంటుంది.గతంలో అయితే ఇలాంటి విషయాలు తెలిసేవి కాదు.కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కూడా సెలెబ్రెటీల చిన్న చిన్న విషయాలు కూడా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే హీరోలతో పాటు వారి భార్యలకు కూడా క్రేజ్ ఫాలోయింగ్ పెరిగిపోతున్నాయి.
హీరోల భార్యలు కూడా తాము చేసే బిజినెస్ గురించి చారిటి గురించి వివరిస్తూ తమకున్న క్రేజ్ ను ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్.మహేష్ బాబు ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.కానీ నమ్రత సినిమా ఇండస్ట్రీకి మాత్రం దగ్గరగానే ఉంటున్నారు అని చెప్పచ్చు.నమ్రత మహేష్ ను బ్రాండ్ గా చూపిస్తూ హంబుల్ అనే టెక్స్టైల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసారు.ఇక ఫాషన్ వేర్ తో పాటు ఏ ఏం బి మల్టీప్లెక్స్ లను స్థాపించారు నమ్రత.మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ పనులను కూడా నమ్రత దగ్గరుండి మరి చూసుకుంటారు.వాటితో పాటు నమ్రత మినర్వాతో కలిసి రెస్టారెంట్లు కూడా స్థాపిస్తున్నారు.రామ్ చరణ్ సతీమణి ఉపాసన బిజినెస్ టైకూన్ గా రాణిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
ఉపాసన అప్పొల్లో హాస్పిటల్స్ కి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తూ హాస్పిటల్ పనులతో పాటు ఫౌండేషన్ పనులు కూడా చూసు కుంటూ ఉంటారు.ఉపాసన ఎయిర్ లైన్స్ బిజినెస్ లో కూడా చురుకుగా ఉంటారు.ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.ఎంబీఏ పూర్తి చేసిన ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి త్వరలోనే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ను స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.నాని భార్య అంజనీ రాజమౌళి ఆర్కా మీడియాలో క్రియేటివ్ హెడ్ గా రాణిస్తున్నారు.బాహుబలి సినిమా టైములో కూడా ఈమె వర్క్ చేసారు.అల్లరి నరేష్ భార్య ఈవెంట్ మ్యానేజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేసి రన్ చేస్తున్నారు.యంగ్ బిజినెస్ ఉమెన్ గా కూడా ఈమె పలు అవార్డులు అందుకున్నారు.వివిధ క్యారక్టర్ ఆర్టిస్ట్ ల భార్యలు కూడా పలు బిజినెస్ రంగాలలో రాణిస్తున్నారు.