Home సినిమా Brahmani Nara : నారా బ్రాహ్మణి కి ఇష్టమైన హీరో ఎవరో ఊహించగలరా…నందమూరి హీరోలు కాకుండా..!

Brahmani Nara : నారా బ్రాహ్మణి కి ఇష్టమైన హీరో ఎవరో ఊహించగలరా…నందమూరి హీరోలు కాకుండా..!

0
Brahmani Nara

Brahmani Nara : నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బ్రాహ్మణి తెలుగు దేశం పార్టీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కోడలు,నారా లోకేష్ సతీమణి.బ్రాహ్మణి బిజినెస్ వుమెన్ గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.సినిమా రంగంలోనూ మరియు రాజకీయరంగంలోనూ తనకు బ్యాక్ గ్రౌంగ్ ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణి సినిమాలలోకి లేదా రాజకీయాలలోకి వెళ్లకుండా తనకంటూ ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.బిజినెస్ ఉమెన్ గా హెరిటేజ్ సంస్థ ను ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు బ్రాహ్మణి.

ఈమె సినిమా రంగంలోకి రాకపోయినప్పటికీ ఈమెకు సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందని చెప్పచ్చు.తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బ్రాహ్మణి కి సినిమా రంగంలో బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఈమెకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం అనే దాని మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.చిన్నప్పటి నుంచి కూడా బ్రాహ్మణి తన తండ్రి నందమూరి బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా చేసేవారట.

Chiranjeevi Balakrishna

ఇక తన తండ్రి సినిమాల కంటే కూడా బ్రాహ్మణి కి తాతయ్య ఎన్టీఆర్ సినిమాలు అంటే చాల ఇష్టమట.బ్రాహ్మణి కి లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు అంటే అంతగా ఇష్టం లేదట.ఇక తనకు బాగా ఇష్టమైన హీరో తన తాతయ్య ఎన్టీఆర్ అని బ్రాహ్మణి పలు సందర్భాలలో కూడా చెప్పడం జరిగింది.తన తండ్రి,తాతయ్య ఇద్దరు కూడా తన కుటుంబం వ్యక్తులే కాబట్టి ఆమె ఇష్టపడటం అనేది సాధారణం.ఇక తమ కుటుంబం వ్యక్తులు కాకుండా బ్రాహ్మణి కి మెగాస్టార్ చిరంజీవి నటన అంటే చాల ఇష్టమట.ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Previous articleRavi Krishna : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 7 /జి బృందావన కాలనీ హీరో…లేటెస్ట్ ఫోటోలు వైరల్
Next articleTollywood: స్టార్ హీరోలే కాకుండా వారి భార్యలు కూడా తోపులే అనే సంగతి తెలుసా…ఏ రంగంలో అంటే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here