రెండు సంవత్సరాలుగా కోవిడ్ ప్రభావంతో చాల మంది ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.ఈ సంవత్సరం కూడా కరోనా మహమ్మారి కారణంగా గడిచిపోయింది.అయితే వచ్చే సంవత్సరం అయినా ఆర్ధిక సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండాలి అంటూ చాల మంది ఆశగా ఎదురు చూస్తున్నారు.వచ్చే నూతన సంవత్సరంలో ఈ ఏడు రాశుల వారికి ఆర్ధికంగా ప్రయోజనాలు ఉంటాయని ఆస్ట్రాలజి ప్రకారం నిపుణులు చెప్తున్నారు.అవి ఏంటంటే..
సింహరాశి:ఈ రాశి ధనలాభం పరంగా అగ్ర స్థానంలో ఉంటుంది.ఈ రాశి వారు చాల కాలంగా చేస్తున్న పని నుంచి రాబడిని ఆశిస్తున్నారు.ఉద్యోగం మారాలి అని అనుకుంటే వచ్చే నూతన సంవత్సరం వాళ్లకు మంచి సమయం అని నిపుణులు చెప్తున్నారు.
కన్య రాశి:ఆర్ధిక స్థిరత్వం మరియు విద్య నుంచి ఈ రాశి వారు ప్రయోజనం పొందుతారు.విదేశీ విద్య గురించి ఆలోచించేవారికి ఇది మంచి అవకాశం.
తులా రాశి:ప్రేమ జీవితం మెరుగుపడుతుంది.తొందరపాటు మరియు త్వరగా నిర్ణయం తీసుకునే ముందే ఆలోచించటం అవసరం.
ధనస్సు:ఈ రాశి వారికి కుజుడు ప్రభావంతో ధన లాభం కలుగుతుంది.నిరుద్యోగులకు ఉపాధి సంవత్సరం.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.ద్వితీయార్ధంలో ఆరోగ్య సమస్యల వలన ఆర్ధిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి.ద్వితీయార్ధంలో స్టాక్ మార్కెట్,బాండ్లు వంటి కొత్త పెట్టుబడి నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చికం:ఏప్రిల్ వరకు ఆర్ధికపయంపై సగటు రాబడి ఉంది ఆ తర్వాత ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.రాహువు ఏప్రిల్ తర్వాత ఈ రాశి వారికి అనుకూల స్తానం లో ఉంటాడు.
కుంభ రాశి:మర్చి తర్వాత వృత్తి పరంగా లక్ష్యాలను సాధించగలరు.రాహువు సంక్రమించడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారంలో ఉద్యోగంలో సవాళ్లు ఉంటాయి.ఏప్రిల్ మరియు మే నెలలో ఆర్ధిక పరంగా అనుకూలమైన సమయాన్ని సూచిస్తుంది.
వృషభం:సంవత్సరం ప్రథమార్ధంలో ఉద్యోగంలో ఉన్న వారికి ఆర్ధిక పరంగా సమస్యలు తలెత్తవచ్చు.అలోచించి పెట్టుబడి పెట్టాలి.ఈ రాశి వారికి జనవరి నుంచి మార్చ్ వరకు ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది.