Home సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా యంగ్ హీరోలకు జోడిగా నటిస్తూ దూసుకుపోతున్న ఈ ఫొటోలో...

తమిళ్ తో పాటు తెలుగులో కూడా యంగ్ హీరోలకు జోడిగా నటిస్తూ దూసుకుపోతున్న ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరంటే…

0

సౌత్ సినిమా ఇండస్ట్రీలో నటి నటులకు బాగా ఫాలోయింగ్ ఉంది.అందులోను హీరోయిన్ లకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తమకు నచ్చిన హీరోయిన్ల కోసం గుడులు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి తమకు నచ్చిన స్టార్స్ ఏవైనా సినిమా అప్ డేట్స్ కానీ చిన్ననాటి ఫోటోలు కానీ షేర్ చేస్తే వాటిని క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు అభిమానులు.తెలుగులో ఇప్పుడు మంచి ఫార్మ్ లో ఉన్న రష్మిక మందాన,పూజ హెడ్గే,కీర్తి సురేష్ ఇలా చాల మంది చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా లో ఈ మధ్యకాలంలో దర్శనం ఇచ్చాయి.

ఇప్పుడు ఇదే తరహాలో ఒక యంగ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో కూడా ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో దర్శనం ఇస్తుంది.ఈ హీరోయిన్ తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో ఈమె యంగ్ హీరోలకు జోడిగా నటించింది.తమిళంలో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది.

ఈ హీరోయిన్ సినిమాలతో పాటు ఫార్ములా వన్ రేసింగ్ లో కూడా తన టాలెంట్ నిరూపించుకుంది.ఈ ఫొటోలో ఉన్న చిన్నారి పేరు నివేద పేతురాజ్.నివేద మెంటల్ మదిలో అనే చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కు హీరోయిన్ గా పరిచయమయ్యింది.చిత్ర లహరి చిత్రం తో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.అలాగే తెలుగులో బ్రోచేవారెవరురా,అల వైఖుంఠాపురములో,రెడ్,పాగల్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ప్రస్తుతం నివేద పేతురాజ్ విరాటపర్వం చిత్రంతో పాటు చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here