Shravan Maas 2025: శ్రావణ మాసానికి హిందూమతంలో ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సమయంలో చేసే చిన్న చిన్న పనులు మహాదేవుడిని సంతోషపెడతాయి. మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి. అయితే ఇటువంటి పవిత్రమైన శ్రావణమాసంలో కొన్ని రకాల మొక్కలను నాటడం వలన చాలా శుభప్రదంగా భావిస్తారు. వీటి వలన ఇంట్లో శివుడి ఆశీర్వాదం కూడా కలుగుతుంది అని సిరిసంపదలకు లోటు ఉండదు అని చాలామంది నమ్ముతారు. శ్రావణ మాసంలో ముఖ్యంగా పూజలు చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి పూజకు ఈ మాసంలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అనేక పనులు చేసి గుర్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మాసంలో ప్రయత్నిస్తారు. అలాగే కొన్ని రకాల మొక్కలను నాటడం వలన కూడా ఈ మాసంలో శివుని ఆశీర్వాదం కలుగుతుంది అని నమ్ముతారు.
ఈ ఏడాది శ్రావణమాసం జులై 11న ప్రారంభం కానుంది. అయితే ఈ మాసంలో నాటాల్సిన 5 పవిత్ర మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా శివుడికి బిల్వపత్రాలు అంటే అలా ఇష్టం. వీటిని శివుడికి సమర్పించడం వలన శివుడి అనుగ్రహం కలుగుతుంది అని నమ్ముతారు. అలాగే ఈ మాసంలో ఇంట్లో మారేడు మొక్కను నాటడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఉమ్మెత్త మొక్క కూడా శివుడికి చాలా ఇష్టం.
ఉమ్మెత్త మొక్కను శివుడికి సమర్పించడం వలన శివుడు సంతోషిస్తాడు అని నమ్ముతారు. హిందూమతంలో తులసి మొక్కకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అయితే తులసి దళాలను శివుడి పూజ కోసం ఉపయోగించకూడదు. కానీ శ్రావణ మాసంలో ఇంట్లో తులసి మొక్కకు పూజ చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. శివుడు మరియు శనీశ్వరుడికి బాగా ఇష్టమైన మొక్క జమ్మి మొక్క. ఈ మొక్కని ఇంట్లో పెట్టుకోవడం వలన ప్రతి కుల శక్తులు తొలగిపోతాయి అని నమ్ముతారు. అలాగే శివుడికి చాలా ప్రియమైన మొక్కలలో జిల్లేడు మొక్క కూడా ఒకటి. శ్రావణ మాసంలో ఈ మొక్కను ఇంట్లో నాటుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు.