బార్లీ గింజల జావాతో శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు…ఆ ప్రయోజనాలు ఏంటంటే…

మన శరీరానికి బార్లీ గింజలు చాల మేలు చేస్తాయి.ఈ బార్లీ గింజలలో అనేక పోషకాలు ఉంటాయి.బార్లీ గింజలు అధిక బరువును తగ్గించటంలో,మూత్రాశయ సమస్యలను తగ్గించడంలో మరియు కిడ్నీ స్టోన్స్ ను కరిగించటంలో చాల బాగా పని చేస్తాయి.అయితే చాల మంది ఈ బార్లీ గింజలను నీటిలో మరిగించి అందులో తేనే,నిమ్మరసం కలుపుకొని తాగుతుంటారు.బార్లీ గింజలతో రుచిగా ఉండే జావను తయారు చేసుకొని తాగవచ్చు.ఈ జావతో శరీరానికి చాల ప్రయోజనాలు కలుగుతాయి.

Advertisement

బార్లీ గింజలతో జావను ఇలా తయారుచేసుకోవాలి…బార్లీ గింజల జావకు పావు కప్పు బార్లీ గింజలు,కప్పు మజ్జిగ,గుప్పెడు దానిమ్మ గింజలు,తగినంత ఉప్పు కావాలి.ముందుగా బార్లీ గింజలను కడిగి 6 నుంచి 8 గంటల వరకు నీటిలో నానబెట్టాలి.ఇలా చేయడం వలన బార్లీ గింజలు త్వరగా ఉడుకుతాయి.ఆ తర్వాత ఈ గింజలను కుక్కర్లో వేసి ఒక 7 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

అవి పూర్తిగా చల్లారిన తర్వాత వడపోసుకోవాలి.ఆ తర్వాత అందులో మజ్జిగ,దానిమ్మ గింజలు,తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలి.దీన్ని అలాగే వెచ్చగా తాగవచ్చు,లేదా ఫ్రిజ్ లో పెట్టుకొని చల్లగా అయినా తాగవచ్చు.ఈ మిశ్రమంలో పటిక బెల్లం లేదా తేనే,నిమ్మరసం కలుపుకొని కూడా తాగవచ్చు.ఇలా తయారు చేయడం వలన బార్లీ గింజల జావా చాల రుచిగా ఉంటుంది.ఈ జావను తాగడం వలన శరీరంలోని వేడి తగ్గి చాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *