చిన్న పిల్లలను బండి మీద కూర్చోబెట్టుకుంటున్నారా…అయితే జాగ్రత్త ఈ వీడియొ చూస్తే షాక్ అవుతారు..

బైక్ ను కుర్రాళ్ళు బాగా ఇష్టపడతారు.ప్రేయసి లేకపోయినా కుర్రాళ్ళు బ్రతుకుతారు కానీ బైక్ లేకుండా మాత్రం బ్రతకలేరు.అయితే చేతిలో బైక్ ఉంటె సరిపోదు ఆ బైక్ నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది.ఎంతో అనుభవం ఉన్న బైక్ రేసర్లు కూడా కొన్ని సార్లు చేసే చిన్న తప్పుల వలన ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.కారు ప్రమాదం జరిగితే ఎయిర్ బెలూన్స్ కాపాడగలవు కానీ బైక్ ప్రమాదం జరగకుండా మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.కానీ చిన్న చిన్న తప్పుల వలన అక్కడక్కడా ప్రమాదం జరిగింది అని వింటూనే ఉంటాము.

స్కూటీ మీద వెళుతున్నప్పుడు పిల్లలను మూడు కూర్చోబెట్టుకుంటే మాత్రం చాల జాగ్రత్త పాటించాలి అని ఈ వీడియొ చూస్తే తెలుస్తుంది.ఈ ఘటనకు చెందిన ఒక షాకింగ్ వీడియొ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ముందు కూర్చున్న పిల్లవాడు చేసిన తప్పు వలన ఆ పిల్లవాడు మరియు తండ్రి ఇద్దరు కూడా గాయాలపాలయ్యారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక తండ్రి తన పిల్లవాడిని ముందు కూర్చోబీటుకొని స్కూటీ స్టార్ట్ చేసారు.ఇంతలో ఆ పిల్లవాడి తల్లి ఏదో వస్తువు తీసుకోని వచ్చి ఇస్తుంది.ఇంతలో ఆ పిల్లవాడు బైక్ ఎక్సలేటర్ ను స్టార్ట్ చేసాడు.దాంతో ఆ పిల్లవాడు బండి ముందుకు దూసుకొని వెళ్లి బండి తో పాటు పడిపోయాడు.ఇక తండ్రి యెగిరి వెనక్కి పడిపోయాడు.అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే వచ్చి తండ్రిని హాస్పిటల్ కి తీసుకోని వెళ్లారు.ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరా లో రికార్డు అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *