Chiranjeevi Family: తాజాగా దసరా,బతుకమ్మ సంబరాలను అనాథ పిల్లలతో జరుపుకొని మెగా ఫ్యామిలీ మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు.అందరు కలిసి బతుకమ్మ ఆడి అనాథ పిల్లల కళ్ళలో ఆనందాన్ని నింపారు.రామ్ చరణ్,ఉపాసన గారాల పట్టి క్లిన్ కార కొణిదెల ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పచ్చు.ఇక ఈ వేడుకలో చిరంజీవి,సురేఖ దంపతులతో పాటు సాయి ధరమ్ తేజ,శ్రీజ,అలాగే చిరంజీవి మనవరాళ్లు కూడా పాల్గొనడం జరిగింది.ఈ వేడుకలో పాల్గొన్న మహిళల లందరికి చిరంజీవి తల్లి అంజనా దేవి చేతుల మీదుగా చీరలు అందజేశారు.
మెగా కోడలు ఉపసరం కొణిదెల ఈ వీడియొ ను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియొ వైరల్ అవుతుంది.గత మూడు దశాబ్దాల నుంచి ఉపాసన అమ్మమ్మ పుష్ప కామినేని బాలిక నిలయం సేవ సమాజ్ ను నిర్వహిస్తున్నారు.కొన్ని నెలల క్రితమే పుష్ప కామినేని కన్నుమూశారు.ఉపాసన తన అమ్మమ్మ పుష్ప కామినేని కి నివాళులు అర్పిస్తూ ఈ క్రమంలోనే సేవ సమాజ్ లోని అనాథ పిల్లలను బతుకమ్మ సంబరాల్లో భాగం చేసారు.
ఉపాసన మెగా స్టార్ కోడలిగా,రామ్ చరణ్ సతీమణి గా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.గతంలోనూ ఉపాసన సేవ కార్యక్రమాలతో అందరి మనసును గెలుచుకున్నారు.ఇక ఇటీవలే జరిగిన తన కూతురు క్లిన్ కార కొణిదెల బారసాల వేడుకలో గిరిజనులను,చెంచులను భాగం చేసిన సంగతి అందరికి తెలిసిందే.వారి ఆశీర్వాదం తన కూతురికి ఉండాలని ఉపాసన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
View this post on Instagram