Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మహేష్ బాబు కూతురిగా అందరికి తెలిసిన సితార తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే సితార కు మంచి ఫాలోయింగ్ ఉంది.సితార సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన ఫోటోలను వీడియొ లను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.అతి చిన్న వయస్సులోనే బాగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది సితార.
సితార ఇటీవలే ఒక యాడ్ లో కూడా నటించి అందరిని మెప్పించింది.అలాగే తన తండ్రి మహేష్ బాబు బాటలోనే పలు మంచి పనులు చేస్తూ అందరి మన్ననలను పొందుతుంది సితార.సితార తన చదువుతో పాటు మన కల్చర్ కి సంబంధించినవి అన్ని కూడా నేర్చుకుంటుంది.పద్ధతిగా తెలుగుగింటి కుందనపు బొమ్మల రెడీ అయ్యి సితార ప్రతి పండుగకి తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.ఇక సితార అని మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.
ఇప్పటికే సితార పలు సార్లు తన డాన్స్ వీడియొ లను షేర్ చేయడం జరిగింది.తాజాగా దసరా పండుగా సందర్భంగా సితార షేర్ చేసిన డాన్స్ వీడియొ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.ఒక హిందీ పాటకు సితార అని మాస్టర్ మరో ఇద్దరితో కలిసి ఫుల్ ఎనర్జీ తో డాన్స్ చేసింది.సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతున్న ఈ వీడియొ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.ఇక ఈ వీడియొ ను చూసిన నెటిజన్లు సితార సంప్రదాయబద్ధం గా యెంత చక్కగా రెడీ అయ్యింది చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు,చాల క్యూట్ గా ఉంది అంటూ ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram