Home సినిమా Bro: బ్రో సినిమాలో సాయిధరమ్ తేజ్ చిన్న చెల్లెలు గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా.!

Bro: బ్రో సినిమాలో సాయిధరమ్ తేజ్ చిన్న చెల్లెలు గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా.!

0
Bro

Bro: పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ ముల్టీస్టారర్ గా సముద్రఖని దర్శకత్వం వహించిన సినిమా బ్రో తాజాగా రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తుంది.తమిళ్ సినిమా అయినా వినోదయ సీతం కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కించబడింది.తమిళ్ లో ఈ సినిమాకు దర్శకత్వం వహించి సముద్రఖని తెలుగులో బ్రో కు కూడా దర్శకత్వం వహించారు.త్రివిక్రమ్ శ్రీనివార్స్ నేటివిటీ కి తగినట్లు కథలో మార్పులు,చేర్పులు చేసారు.సముద్రఖని ఈ సినిమాను కేవలం 21 రోజుల్లో పూర్తి చేసారు.

జులై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో రాణిస్తుంది.టైం,సెంటిమెంట్ చుట్టూ కథను అల్లుకొని ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సముద్రఖని.ఈ సినిమాలో చెల్లెలి సెంటిమెంట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కు జోడిగా కేతిక శర్మ నటించింది.అలాగే ఈ సినిమాలో హీరో మార్కండేయులు కు ఇద్దరు చెల్లెల్లు మరియు ఒక తమ్ముడు ఉంటాడు.

ఆ ఇద్దరు చెల్లెల్లు ప్రియప్రకాష్ వారియర్ మరియు యువలక్ష్మి.చిన్న చెల్లెలి చుట్టూ కథ తిరుగుతుంది.ఈ సినిమా లో యువలక్ష్మి క్యారక్టర్ కే ఎక్కువ స్కోప్ ఉంది అని తెలుస్తుంది.యువలక్ష్మి చిన్నప్పటి నుంచి చాల సినిమాలలో నటించింది.అయితే ఈ విషయం చాల మందికి తెలియక పోవచ్చు.తమిళ్ లో పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించింది.ఈమె చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.తమిళ్ ఈమె వరుస సినిమాలలో బిజీ గా మారిపోయింది.ఎక్కువగా సముద్రఖని సినిమాలలో అలరించిన యువలక్ష్మికి బ్రో సినిమాలో తెలుగులో మొదటి సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here