Bro Movie: బ్రో సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఇదే…ఆసక్తికరమైన విషయం చెప్పిన దర్శకుడు

Bro Movie

Bro Movie: పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోపక్క వరుసగా సినిమాలు కూడా చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ బ్రో సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న సంగతి అందరికి తెలిసిందే.ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తమిళ్ సినిమా అయినా వినోదయ సీతం మూవీ కు రీమేక్ గా ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించారు.పవన్ కళ్యాణ్,సాయిధరమ్ తేజ్ కాంబో లో వచ్చిన ఈ సినిమా జులై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తమిళ్ లో ఈ సినిమా పేరు వినోదయ సీతం అంటే తమిళ్ లో వెర్రి మనస్సు అనే అర్ధం వస్తుంది.

ఇక ఇదే సినిమాను దర్శకుడు సముద్రఖని బ్రో పేరుతొ రీమేక్ చేసారు.అయితే ఈ సినిమాకు ముందు వేరే టైటిల్ ను అనుకున్నట్లు దర్శకుడు సముద్రఖని చెప్పుకొచ్చారు.బ్రో అనే టైటిల్ కు ముందు ఈ సినిమాకు కాల పురుషుడు అనే టైటిల్ ను అనుకున్నారట.కాల పురుషుడు టైటిల్ వినడానికి పవర్ ఫుల్ గా మాస్ గా ఉన్నప్పటికీ కంటెంట్ పై తప్పు అంచనాలకు దారితీస్తుందని భావించి ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట.

ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు.ఇక తెలుగు రీమేక్ లో కూడా సముద్ర ఖని దర్శకత్వం చేసారు.స్క్రీన్ప్లే,డైలాగ్స్ అన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ చూసుకున్నారు.మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ గా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా ఓటిటీ స్ట్రీమింగ్ గురించి కూడా ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా ఓటిటీ స్ట్రీమింగ్ ను సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా స్ట్రీమింగ్ చేయనున్నారు అని వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *