మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వలన ఏం జరుగుతుందో తెలుసా…

Moola Nakshatram

చాల మంది వివాహం విషయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ ఉంటారు.అలా తప్పనిసరిగా పాటించే నియమాలలో అమ్మాయి,అబ్బాయి జాతకం కలవడం కూడా ఒకటి.అమ్మాయి,అబ్బాయి జాతకాలూ కలిస్తేనే వివాహం చేస్తారు చాల మంది.అయితే మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకోకూడదు అని చాల మంది చెప్తుంటారు.నిజంగానే మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకుంటే ఏం జరుగుతుంది…శాస్త్ర నిపుణులు ఏం చెప్తున్నారు…ఇప్పుడు తెలుసుకుందాం…మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లిని చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు అవుతారని శాస్త్రనిపుణులు చెప్తున్నారు.

కొంత మంది తెలిసి తెలియక మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వలన వారి ఇంట్లో అలా జరిగింది ఇలా జరిగింది అంటూ లేని పోనీ అపోహలు కలిగిస్తూ ఉంటారు.ఒకవేళ వాళ్ళు అనుకున్నదే అయితే కనుక ఆ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి జీవితంలో చదువు సంధ్యలు లేకుండా అనేక ఇబ్బందులు పడాలి..ఇంకా ఆ అమ్మాయి పుట్టిన వెంటనే కుటుంబానికి కూడా ఏదో ఒకటి జరిగి ఉండాలి.

కానీ అలా జరగలేదు.ఆ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు.ఇంకా తల్లితండ్రులు వాళ్లకు అంగరంగ వైభంగా పెళ్లిళ్లు కూడా చేసారు.ఇక ఆ నక్షత్రంలో పుట్టడం వలన ఎవరికి సమస్య వస్తుంది అనే దాని గురించి ఆలోచించుకోవాలి.కొంత మంది క్రియేట్ చేసిన లేనిపోని అపోహలను చాల మంది నమ్ముతున్నారని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *