Home సినిమా పార్టీ లేదా పుష్పా…అనే డైలాగ్ తో అదరకొట్టిన భన్వర్ సింగ్ షకావత్ పాత్ర రెమ్యూనరేషన్ ఎంతో...

పార్టీ లేదా పుష్పా…అనే డైలాగ్ తో అదరకొట్టిన భన్వర్ సింగ్ షకావత్ పాత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

0

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.అటు హిందీ లో కూడా ఈ చిత్రం కేజీఎఫ్ 2 రికార్డులను అధిగమించింది.రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ఇటీవలే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.రెండవ భాగం అయినా పుష్ప ది రూల్ 2022 సంవత్సరంలో విడుదల కానుంది.మొదటి భాగం అయినా పుష్ప ది రైజ్ లో యాంకర్ అనసూయ మరియు సునీల్ ముఖ్య పాత్రలలో కనిపించారు.

రష్మిక మందాన అల్లు అర్జున్ కు జోడిగా శ్రీవల్లి పాత్రలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ చిత్రంలో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే మరొక పాత్ర భన్వర్ సింగ్ షకావత్.పుష్ప మొదటి భాగంలో భన్వర్ సింగ్ పాత్ర ఉండే టైం తక్కువే అయినా పుష్ప రెండవ భాగంలో మాత్రం పుష్ప రాజ్ కు భన్వర్ సింగ్ షకావత్ కు గట్టిగానే ఫైట్ ఉండబోతుందని తెలుస్తుంది.భన్వర్ సింగ్ షకావత్ పాత్ర చేసిన నటుడు ఎవరు అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ జరుగుతుంది.

భన్వర్ సింగ్ షకావత్ పాత్ర చేసింది మలయాళ నటుడు అయినా ఫహద్ ఫాసిల్.మలయాళంలో మరియు తమిళ్ లో ఆయన సినిమాలు చేసారు.తెలుగులో పుష్ప సినిమాతో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో ఫహద్ ఫాసిల్ ఎంట్రీ ఇచ్చారు.అయితే పుష్ప సినిమా కు ఫహద్ ఫాసిల్ 3 .5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం.పుష్ప చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ అత్యధిక వ్యూస్ తో యు ట్యూబ్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here