Home సినిమా గజినీ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన 12 మంది స్టార్ హీరోలు వీళ్ళే…

గజినీ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన 12 మంది స్టార్ హీరోలు వీళ్ళే…

0

కోలీవుడ్ హీరో సూర్య,మురుగదాస్ కంబినేషన్లో తెరకెక్కిన చిత్రం గజినీ యెంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే.గజినీ చిత్రం హీరో సూర్య కు సౌత్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చి పెట్టింది.ఈ చిత్రంలో సూర్య అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్,హరీష్ జయరాజ్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రం హిట్ అవడంలో కీలకం వహించాయి.అయితే సినిమా పట్టాలు ఎక్కడం వెనుక మాత్రం చాల కథ నడిచింది.దాదాపుగా 12 మంది స్టార్ హీరోలు ఈ సినిమా కథను రిజెక్ట్ చేయగా చివరకు అదే కథతో సూర్య బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.రమణ అనే సినిమా తర్వాత మురుగదాస్ స్టార్ డైరెక్టర్ హోదాను సంపాదించుకున్నారు.ఆ తర్వాత మురుగదాస్ తీసిన రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

ఆ తర్వాత తీయబోయే సినిమా కూడా భిన్నంగా ఉండాలని హాలీవుడ్ మూవీ అయినా మెమెంటో లైన్ బేస్ చేసుకొని ఒక కథ రాసుకున్నారు మురుగదాస్.2003 లో కథను పట్టుకొని స్టార్ హీరోల దగ్గరకు వెళ్లడం మొదలు పెట్టారు.తెలుగు నిర్మాత అయినా సురేష్ బాబు కు మొదట ఈ చిత్రం కథను వినిపించారు.తన బ్యానర్ లో ఈ సినిమా చేయడానికి అంగీకరించిన సురేష్ బాబు రిస్క్ కథ కదా ఏ హీరో చేస్తారు అని అడగడం జరిగింది.మహేష్ బాబు అయితే బాగుంటుంది అని మురుగదాస్ చెప్పడం జరిగింది.అయితే మహేష్ బాబు ఈ కథ తనకు సూట్ కాదని రిజెక్ట్ చేయడంతో వెంకటేష్ తో చేయాలనీ అనుకున్నారు.

గుండు గెటప్ చేసేందుకు వెంకటేష్ నో చెప్పడంతో పవన్ కళ్యాణ్ తో చేయాలనీ అనుకున్నారు.అప్పటికే జానీ సినిమాతో ప్లాప్ అందుకున్న పవన్ కళ్యాణ్ ఈ కథను చేయడానికి ఆసక్తిని చూపించలేదు.ఇక తమిళ్ హీరోలు అయినా కమల్ హాసన్,విజయ్,ఇలా 10 మంది స్టార్ హీరోలు ఈ కథను రిజెక్ట్ చేయడం జరిగింది.ఇక ఈ కథను పక్కన పెట్టేయాలి అని అనుకున్న టైములో అజిత్ ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారు.2004 మార్చ్ లో షూటింగ్ స్టార్ట్ అయినా 15 రోజుల తర్వాత నిర్మాతలతో గ్యాప్ రావడంతో అజిత్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు.

ఓకే చెప్పిన మాధవన్ కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు.చివరకు నిర్మాతలు కూడా ఈ సినిమా చేయడానికి రిజెక్ట్ చేసారు.ఎలాగైనా ఈ సినిమా చేయాలనీ అనుకున్న మురుగదాస్ సూర్య ను ఈ సినిమా చేయడానికి ఒప్పించారు.ఇక కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది.అమిర్ ఖాన్ ఆసక్తి చూపించి హిందీ లో ఈ సినిమా చేసారు.హిందీ లో ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు.అక్కడ కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మురుగదాస్ కు ఈ చిత్రం ఎప్పటికి తిరుగులేని క్రేజ్ ను సంపాదించి పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here