Roti: చాల మంది చపాతీ,రోటి వంటివి తింటుంటారు.వరి అన్నంతో కలిగే సేడ్ ఎఫెక్ట్స్ ను దృష్టిలో పెట్టుకొని చాల మంది ప్రతి రోజు రోటి,పుల్కా వంటివి తింటుంటారు.అయితే వారు రోటీలు చేసుకునేటప్పుడు వాటిని పెనం పై కాకుండా నేరుగా గ్యాస్ మంటపై కలుస్తుంటారు.ఇలా నేరుగా చపాతీలను గ్యాస్ మంటపై కాల్చటం ఆరోగ్యానికి చాల ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.దక్షిణాదిలో రోటీలను చాల తక్కువగానే తింటారు కానీ ఉత్తరాదిలో రోటీలను తినే వారి సంఖ్యా ఎక్కువే అని చెప్పచ్చు.
అయితే రోటీలను అధిక ఉష్ణోగ్రత వద్ద నేరుగా గ్యాస్ మంటపై కాల్చటం వలన వీటిలో హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెప్తున్నారు.ఇవి కాన్సర్ కి కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అధిక ఉష్ణోగ్రత పై రోటీలను కాల్చటం వలన వీటిలో కాన్సర్ కు కారణం అయ్యే అకిలమైడ్,హెటేరో సైక్లిక్ అమైన్లు,పాలి సైక్లిక్ ఆరోమ్యాటిక్ హైడ్రో కార్బన్లు ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెప్తున్నారు.రోటీలు కాల్చినప్పుడు నల్లగా మారిన భాగాలలో శరీరానికి హానికరమైన కార్బన్ సమ్మేళనాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.వీటి వలన శ్వాసకోశ,గుండె సమస్యలతో పాటు కాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు చెప్తున్నారు.