Varun Tej: లావణ్య ను పెళ్లి చేసుకున్న వరుణ్ యెంత కట్నం తీసుకున్నాడో తెలుసా.!

Varun Tej

Varun Tej: తాజాగా నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్,హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి జూన్ 9 న నిశ్చితార్ధం చేసుకున్నారు.ఆ తర్వాత తాజాగా నవంబర్ 1 న ఇటలీ లోని టాస్కానిలో వీరిద్దరూ కుటుంబ సభ్యులు మరియు పలువురు సినీ ప్రముఖుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు.వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతున్నాయి.ఇటలీ లో వరుణ్,లావణ్య పెళ్లి చాల గ్రాండ్ గా జరిగింది.

అక్టోబర్ 30 నుంచే వీరి పెళ్లి సెలెబ్రేషన్స్ షురూ అయ్యాయి.ఇక అప్పటి నుంచే మెగా,అల్లు ఫ్యామిలీతో పాటు మరికొంత మంది సినిమా సెలెబ్రెటీలు ఈ వేడుకలో సందడి చేసారు.అయితే లావణ్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్ యెంత కట్నం తీసుకున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.లావణ్య త్రిపాఠి ని గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్ లావణ్య తల్లితండ్రుల నుంచి ఎలాంటి కట్నం కూడా తీసుకోలేదని తెలుస్తుంది.

పెళ్లి ఖర్చు కూడా మొత్తం వరుణ్ నే పెట్టుకున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే వరుణ్,లావణ్య తమకు ఎంతో ఇష్టమైన దేశం అయినా ఇటలీ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ను జరుపుకున్నారు.ఇటలీ టాస్కాని లో బొర్గో షాన్ ఫెలిస్ రిసార్ట్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.ఈ పెళ్ళిలో లో మనీష్ మల్హోత్రా డిసైన్ చేసిన క్రీం గోల్డ్ కలర్ షేర్వాణీ ని ధరించారు వరుడు వరుణ్ తేజ్.అలాగే లావణ్య త్రిపాఠి కూడా మనీష్ మల్హోత్రా డిసైన్ చేసిన కాంచీపురం చీరను ధరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *