Janhvi Kapoor: దీవింగత నటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ జాన్వీ కపూర్.సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే తన అందంతో అభినయంతో క్రేజ్ హీరోయిన్ గా ఎదిగింది జాన్వీ కపూర్.ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న టాప్ యంగ్ హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు అని చెప్పచ్చు.తన లుక్స్ తో గ్లామర్ తో,నటనతో పాపులారిటీ ని ఫాలోయింగ్ ను సంపదయించుకున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ కు జోడిగా దేవర సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర.కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తుంది.హై వోల్టేజ్ యాక్షన్ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాకు గాను జాన్వీ కపూర్ భారీ పారితోషకం అందుకుంటుందని సమాచారం.తన మొదటి సౌత్ ఇండియా సినిమా అయినా తెలుగు దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ ఏకంగా రూ.5 కోట్లు పారితోషకం తీసుకుంటుందని సమాచారం.దేవర సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా జాన్వీ లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పచ్చు.ఈ సినిమా లో పల్లెటూరి అమ్మాయి పాత్రలో జూనియర్ శ్రీదేవి కనిపించబోతుంది అని తెలుస్తుంది.
View this post on Instagram